Tuesday, March 16, 2010

పరిరక్షణకమిటిచేసినశాంతి , అభివృద్ధికార్యక్రమాలవివరాలతోకూడిన తీపి జ్ఞాపకాలు పుస్తకాన్ని
జనవిజ్ఞానవేదిక రాష్ట్రనాయకులు డాక్టర్ మువ్వా రామరావు, డాక్టర్ కొల్ల నాగేశ్వరరావు , మొహమ్మద్ మియా, జంపకృష్ణకిషోర్, జగ్గారావు, వెంకటేశ్వర్లు, మాదివాడ తదితరులు విడుదలచేయటం జరిగింది. ఈపుస్తకాలు కొత్తతరం విద్యార్ధులకు గ్రామంపట్లసేవా స్ఫూర్తిని కలిగించటానికి వుద్దేచించి రూపొందించటం జరిగింది. ఇవిహైస్కూల్ లైబ్రరీలో అందుబాటులోఉన్నాయ్ . గ్రామయువకులందరూ చదవవలచిందిగాకోరుతున్నాను.




బాడవ పొలం కు వెళ్ళే మురుగు కాల్వ పై బ్రిడ్జి నిర్మాణ అవసరాన్ని, స్మశానానికి శవాలను
తీసు కెళ్ళే దారిలో గోడ నిర్మాణాల అవసరాన్ని అధికారులను తీసుకొచ్చి వివరిస్తున్న మాదివాడ 2012 లో రెండు నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెప్పటం జరిగింది.


====

ఈనాడు సిటీ మెయిన్ తేది 01.05.2011


===================


తేది 15.04.2011
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదం ... గ్రామానికి పెను విషాదంతొమ్మిది మందికి జీవిత ఖైదు
వల్లభుదాసు సురేష్ హత్య కేసులో ఈ క్రింది తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ తెనాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈ రోజు తీర్పు ఇవ్వటమైనది.
01. బచ్చు క్రిష్ట రావు 02) బచ్చు రంగ రావు 03) వల్లభుదాసు సీతారామయ్య 04) వల్లభుదాసు రమేష్ 05) వల్లభుదాసు మురళి కృష్ణ 06) బచ్చు సాంబశివ రావు 07) విశ్వనాధుని కృష్ణ రావు 08) విశ్వనాధుని అప్ప రావు 09) బచ్చు చిన్నబ్బాయి

విషాదకర పరిస్థితిలో ఎలాంటి నేరం చేయకుండా శిక్షకు గురగుచున్న హతుని కుటుంబీకులకు ... శిక్షలు పడ్డ కుటుంబాల మహిళలకు, వారీ భిడ్డలకు పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటి తన ప్రగాడ సానుభూతిని తెలుపు చున్నది. పరిస్తితి నుంచి గ్రామస్తులను కాపాడటంలో విఫలమై నందుకు విచారిస్తున్నాం. మా వైఫల్యానికి కారణాలను గతంలోనే పూర్తీ వివరణ ఇవ్వటం జరిగింది.
----

వరి కుప్ప కాల్చి వేత
వల్లభుదాసు నానా రావు కుమారునికి చెందిన ఎకరం వరికుప్పను గుర్తుతెలియని దుండగులు జనవరి 9 2011న కాల్చివేయటం జరిగింది. ఈ సంఘటన కారణంగా తిరిగి గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామంలో అనేకం వరికుప్పల కాల్చివేత సంఘటనలు జరుగుచున్న ... ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకో లేక పోవటంతో ఫ్యాక్షన్ కక్షలు పెరుగుచున్నై మరియు ఆత్మ హత్యలు జరుగు చున్నై. పోలీసు శాఖ వరికుప్పల కాల్చివేత దుండగులను పోలీసు శునకాలను ఉపయోగించి పట్టుకోవాలని కమిటి గతంలోనే అనేకసార్లు విజ్ఞప్తి చేయటం జరిగింది.




18.02.2005 తేదిన పోలీసు శాఖవారు క్రింది హెచ్చరికను మిలటరీ వెంకయ్య గారి గోడపైన, మరియు పంచాయతి పైన పరిరక్షణ కమిటి చేతపెద్ద అక్షరాలతో రాయించి గ్రామస్తులందరూ ప్రతిరోజూ చదివేల చేయటం జరిగింది. మూడు సంవత్సరాలకు పైగా గ్రామస్తులు హెచ్చరికను చదవటం జరిగింది. పోలీసు వారు హెచ్చరించిన విధంగానే హత్య జరిగిన తరువాత బైండ్ ఓవర్ తదితర చర్యలు తీసుకుంటే... ఇప్పుడు కమిటి పై నిందలు వేయటం తగదు.
కమిటి తన మొదటి న్యూస్ లెటర్లో ప్రచురించినదే క్రిందిది

మాదివాడ రామ బ్రహ్మం పెద్దవరం గ్రామంలో పర్యటించి నిర్వహించిన శాంతి కార్య క్రమాలు (12.03.2010 - 15.03.2010)

వి.వి.శేషు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్షెమ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన నగరం ఎస్. . శ్రీ కరిమ్ముల్లా షావలి మరియు మాదివాడ.హైస్కూల్ విద్యార్దులకు పెద్దవరం గ్రామంలో ముఠాతత్త్వం కారణంగా జరిగిన ఘోరాలను యువకులకు వివరించి ... గొడవలు వద్దని, మద్యం బీడీ , సిగరెట్ త్రాగాబోమని, చక్కగా చదువు కుంటామని వారి చేత ప్రమాణం చేఇంచటం జరిగింది.


బాడవ పొలంలోకి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మురుగు కాల్వ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కమిటీ నాయకులు మాదివాడ, వల్లభుదాసు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి 15 లక్షలు కమిటీ మంజూరి చేయించటం జరిగినప్పటికీ ... గ్రామస్తులు నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం ఆలస్యం అవుతుంది.

No comments:

 

Contact: madivada@rediffmail.com