Sunday, November 23, 2014

హైస్కూలు విద్యార్దుల ప్రమాణం 2017

కత్తులతో కాదు .... కలాలతో సాధిస్తాం
ఈ రోజు (14.09.2017) మన పెద్దవరం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమం. గ్రామ యువత చేత ప్రమాణం చేయిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ అద్దంకి శ్రీనివాస రావు గారు.












Dt.11.09.2017
ఏ గొడవలు మాకు వద్దు ... మా చదువులే మాకు ముద్దు
పెద్దవరం యువత ప్రమాణం
-----------------------------------------------------------------
పెద్దవరం గ్రామ ఉన్నత పాఠాశాలలో ఈ రోజు గ్రామ పరిరక్షణ కమిటీ అధ్వర్యం లో జరిగిన శాంతి పరిరక్షణ కార్యక్రమంలో నగరం సబ్ ఇన్ స్పెక్టర్ అద్దంకి వెంకటేశ్వర్లు అతిధిగా పాల్గొన్నారు.

ఉన్నత పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు గ్రామంలో ర్యాలీగా '' ఏ గొడవలు మాకు వద్దు ... మా చదువులే మాకు ముద్దు '' కత్తులతో కాదు ... కలాలతో సాద్దిస్తాం'' నినాదాలు చేస్తూ ప్లే కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ తిరిగారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సామూహిక ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నగరం సబ్ ఇన్ స్పెక్టర్ అద్దంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామ పరిరక్షణ కమిటి ఇలాంటి శాంతి కార్యక్రమాలను నిర్వహించటం చక్కటి ఫలితాలను ఇస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గ్రామానికి మంచి పేరు తేవాలని, గ్రామస్తులందరూ గతాన్ని మరిచి ఐక్యంగా జీవించటం అలవచుకోవటం ద్వారా, గ్రామానికి మంచిపేరు తేగలరని అన్నారు.
అనంతరం, పరిరక్షణ కమిటీ స్థాపకుడు మాదివాడ రామబ్రహ్మం హైద్రాబాదు నుంచి పంపించిన పెన్ సెట్స్ ను ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగరం సబ్ ఇన్ స్పెక్టర్ అద్దంకి వెంకటేశ్వర్లు చేతులమీదుగా అందించారు. మాదివాడ రామబ్రహ్మం తన సందేశాన్ని పంపుతూ, గ్రామానికి తన వంతు సహాయం చేయటాన్ని తాను ఎప్పుడూ సిద్ధమేనని, గ్రామం అభివృధ్ధికోసం గత దశాబ్దకాలంగా తాను చేస్తున్న కృషి గ్రామస్తులందరికి తెలిసిందేనని, గ్రామస్తులు సహకరిస్తే, ప్రభుత్వం నుంచి మరింత సహాయాన్ని గ్రామానికి తేగలనని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట రాజకుమార్ , గ్రామ పెద్దలు కోట హరే రామ్ , మద్ది కోటేశ్వరరావు, వల్లభుదాసు పూర్ణయ్య, ఉన్నతపాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.














 గొప్ప సేవాగుణాన్ని చాటుకుంటున్న దాత శ్రీ వేదాల రాధాకృష్ణమా చార్యులవారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు  (08.07.2017)




Dt.07.07.2017
ఇది ప్రతి సంవత్సరం మన పెద్దవరం గ్రామ హైస్కూల్లో గ్రామ పరిరక్షణ కమిటీ యువత  చేత చేయిస్తున్న ప్రమాణం . మరి కొద్ది రోజుల్లో మళ్ళీ జరగబోతుంది. గ్రామస్తులు కూడా పాల్గొని... విద్యార్థులను ప్రోత్సహించి కార్యక్రామాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ గ్రూపులో ఉన్న వారు... వారి కుటుంబ సంభ్యులకు తెలిపి పాల్గొనేలా చేయవలచిందిగా విజ్ఞప్తి. 




 



మా పెద్దవరం గ్రామస్తులకు: Dt.21.07.2016
......................................
పెద్దవరం మిత్రులారా !
నగరం పోలీసు ముఖపుస్తక గోడమీద, ధూళిపూడిలో సి సి కెమెరాలు పెట్టిన వార్తను చూసి ... నేను వెంటనే ''మా పెద్దవరం గ్రామంలో కూడా సి సి కెమెరాలు పెట్టండి ... అందుకు నావంతుగా రూ.10,000/- ఇస్తాను ... మరియు హైద్రాబాదులో ఉన్న మాగ్రామస్తుల నుంచి మరో రూ.50,000/- వరకు సేకరించి ఇస్తాను'' అని నగరం పోలీసులకు సందేశం పెట్టటం జరిగింది. అదే ఈ రోజు స్థానిక పత్రికల్లో వార్తగా వచ్చింది.
హైద్రాబాదులు ఉన్న వారే కాకుండా .... అనేక ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు స్పందించి .... ఆర్ధిక సహాయాన్ని అందించవలచిందిగా కోరుతున్నాను . నేరాల అదుపులో సి సి కెమెరాల పాత్ర ఎంత కీలకమైనదో ... మన గ్రామానికి ఎంత అవసరమో మీకు కొత్తగా చెప్పనక్కరలేదు. మన గ్రామంలోని ప్రతి రోడ్డును కవర్ చేస్తూ సి సి కెమెరాలను పెట్టగలిగితే .... నేర ఆలోచనా మనస్తత్వం ఉన్నవారికి చెక్ పెట్టవచ్చు. తరచుగా జరుగుతున్న వరికుప్పల కాల్చివేత దుర్మార్గుల ఆట కట్టించవచ్చు. తాగి గ్రామంలో హల్ చల్ చేసే నీతిమాలిన వెధవల చేష్టలకు పాతర వేయవచ్చు. అమాయకులను కేసుల్లో ఇరుక్కోకుండా కాపాడవచ్చు. ఒక్క సి సి కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని హైద్రాబాదు పోలీసులు పదే పదే చెప్పి ... సి సి కెమెరా ఫుటేజీతో కేసులను కొన్ని గంటల్లోనే చేధిస్తున్న విషయం మీకు తెలియంది కాదు.
కొద్దీ నెలల క్రితం ఓ దేవాలయ నిర్మాణానికి కొందరు గ్రామస్తులు వస్తే ... దాదాపు అందరూ (నేను తప్ప) విరాళాలు ఇచ్చారు. ఆరు దశాబ్దాలుగా గ్రామాన్ని పట్టి పీడిస్తున్న నేరమయ సంఘటనల నివారణకు కూడా అంతే మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను.
.... గ్రామంపట్ల అభిమానం ఉన్న అందరూ స్పందించవలచిందిగా మనవిచేస్తున్నాను. మీ ఆర్ధిక భాగస్వామ్యాన్ని బాలానగర్లో ఉన్న విశ్వనాధుని రాంబాబుకి అందించండి.



మాదివాడ రామబ్రహ్మం కుటుంబం పంపిన పెన్ సెట్స్.. హై స్కూల్ విద్యార్ధి ... విధ్యార్ధులకు. పంచి ... వారిచేత '' కత్తులతో కాదు .. కలాలతో సాదిత్తం'' అనే ప్రమాణాన్ని చేయించటం జరిగింది.  గ్రామస్తులకోసం ప్రత్యేకంగా రూపొందించిన పాటల సి డి లు కూడా ఆవిష్కరించటం జరిగింది. విద్యార్ధులు నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలి చేయటం జరిగింది. ఎ బి ఎన్ టి వి వారు ఈ మానవీయ కార్యక్రమాన్ని చిత్రీకరించి ... ప్రసారం చేయటం జరిగింది  (తేది 16.12.2015)



















No comments:

 

Contact: madivada@rediffmail.com